తగ్గనున్న ఉల్లి ధరలు!

ప్రస్తుతం ఉల్లి ధరలు పెరుగుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని 123 నగరాల్లో నిల్వ ఉల్లిపాయలను విక్రయిస్తోంది. అక్టోబర్ 10న దేశవ్యాప్తంగా కిలో ఉల్లిపాయల సగటు ధర ₹52.99గా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో కిలో ధర ₹26.65గా ఉంది. కొత్త పంట మార్కెట్‌లోకి వస్తుండటంతో రానున్న రోజుల్లో ఉల్లి ధరలు తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.



