← Back to news

దసరా ఎఫెక్ట్.. హైదరాబాద్‌–విజయవాడ హైవేపై రద్దీ!

By Bala· 3h ago

యాదాద్రి జిల్లాలో హైదరాబాద్‌ నుంచి విజయవాడ నేషనల్ హైవే వాహనాల రద్దీ పెరిగింది. దసరా పండుగకు సొంతూళ్లకు బయలుదేరిన నగరవాసులతో చౌటుప్పల్‌ మండలం ధర్మోజిగూడెం నుంచి వలిగొండ క్రాస్‌రోడ్డు వరకు వాహనాలు బారులుదీరాయి. ఫ్లైఓవర్ల నిర్మాణ పనులతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు.

More in Current Affairs