← Back to news

లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు

By GOLLAPALLI SUDHAKAR RAO· 1h ago· Varikuntapadu, Varikuntapadu, Sri Potti Sriramulu Nellore
లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు

గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ, లింగ ఎంపికకు పాల్పడితే సంబంధిత స్కానింగ్ కేంద్రాలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వెంకటేశ్వర్లు హెచ్చరించారు. స్కానింగ్ కేంద్రాలపై అధికారులు తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, రికార్డులను పరిశీలించాలని ఆదేశించారు. అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా లింగ వివక్ష నిర్మూలన, బాలికల హక్కుల పరిరక్షణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు

More in Local