APPSC అభ్యర్థులకు అలర్ట్.. స్టేట్ NCL తప్పనిసరి!

ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే బీసీ అభ్యర్థులకు అలర్ట్. రిజర్వేషన్ కోసం స్టేట్ నాన్-క్రీమీ లేయర్ (NCL) సర్టిఫికెట్ తప్పనిసరి. కేంద్ర ఉద్యోగాలకు వాడే సెంట్రల్ ఓబీసీ (OBC-NCL) సర్టిఫికెట్ రాష్ట్ర ఉద్యోగాలకు చెల్లదు. అభ్యర్థులు ఏపీ ప్రభుత్వ ఫార్మాట్లో తహసీల్దార్ (MRO) జారీ చేసిన ప్రత్యేక స్టేట్ 'BC-NCL' సర్టిఫికెట్ తీసుకోవాలి. మీసేవా లేదా సచివాలయం ద్వారా పాత కుల, వార్షిక ఆదాయ (₹8 లక్షల లోపు) పత్రాలతో అప్లై చేయొచ్చని అధికారులు చెబుతున్నారు.



