← Back to news

ఫామ్‌ల్యాండ్‌ వెంచర్లతో కొత్త దందా!

By A.Ajay· 1h ago
ఫామ్‌ల్యాండ్‌ వెంచర్లతో కొత్త దందా!

TG: సంగారెడ్డి జిల్లా.. నారాయణఖేడ్‌ ప్రాంతంలో ఫామ్‌ల్యాండ్‌ పేరుతో గుంట, రెండు గుంటల భూములను ప్లాట్లుగా చేసి అమ్ముతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నాగల్‌గిద్ద, కంగ్టి, సిర్గాపూర్‌ మండలాల్లో 3 వేల ఎకరాలకు పైగా ఇలాంటి వెంచర్లు ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌, ప్రైవేట్‌ ఉద్యోగులు ఎక్కువగా కొంటున్నారు. వ్యవసాయ భూమిని ఇతర అవసరాలకు మార్చాలంటే రూల్స్ ప్రకారం NALA అనుమతి అవసరం. కొనే ముందు అనుమతులు సరిగా ఉన్నాయో చూసుకోవడం ముఖ్యం.

More in TG