← Back to news

SIRపై కలెక్టర్‌ కీలక ఆదేశాలు

By A VIJAY KUMAR· 1h ago· Narsampet (Ct), Narsampet, Warangal
SIRపై కలెక్టర్‌ కీలక ఆదేశాలు

TG: SIR ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో ఎలాంటి లోపాలకు తావులేకుండా నిబంధనల ప్రకారం పనులు నిర్వహించాలని వరంగల్ జిల్లా కలెక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. నర్సంపేట మండలం లక్ష్మీపల్లిలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రంలో ఓటర్లకు అందుతున్న సేవలు, ఫారం-6, 7, 8ల లభ్యత, ప్రక్రియ పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని సూచించారు. ఈ నెల 12, 13 తేదీల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

More in Local