యూట్యూబ్ చూసి అబార్షన్.. అరెస్ట్!

మహారాష్ట్రలోని నాగ్పూర్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల బాలిక గర్భం దాల్చడంతో, ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పిన 18 ఏళ్ల యువకుడు యూట్యూబ్ వీడియోలు చూసి అబార్షన్కు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. లిక్విడ్, టాబ్లెట్లు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రయత్నం విఫలం కావడంతో బాలిక ఇంట్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ల సమాచారంతో పోలీసులు POCSO చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.


