పోలీసులకు కోర్టు బిగ్ ట్విస్ట్!

అరెస్ట్ చేసినప్పుడు కారణాలు లిఖితపూర్వకంగా ఇవ్వకపోవడం వల్ల అరెస్ట్ చెల్లకుండా పోతే.. మేజిస్ట్రేట్ పర్మిషన్ లేకుండా నిందితుడిని మళ్లీ రీ-అరెస్ట్ చేయడం లీగల్‌గా చెల్లదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. నిందితుడిని తిరిగి కస్టడీలోకి తీసుకోవాలంటే తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాల్సిందేనని జస్టిస్ సురేశ్ కుమార్ కైత్ ధర్మాసనం తేల్చిచెప్పింది. ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా రీ-అరెస్ట్ చేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది.



