ఇది మగవాళ్లు-ఆడవాళ్ల మధ్య పోరాటం కాదు: కృతి సనన్

బిహార్ రాష్ట్రం జముయ్‌లో 10వ తరగతి అమ్మాయిపై జరిగిన దాడి ఘటనపై నటి కృతి సనన్ రియాక్ట్ అయ్యింది. , ఇలాంటి సమస్యలను మగవాళ్లు-ఆడవాళ్ల మధ్య పోరాటంగా చూడకూడదని అన్నారు. మహిళలపై హింస, వేధింపులకు అనుమతించే మనస్తత్వమే పెద్ద సమస్య అని చెప్పారు. పితృస్వామ్య ఆలోచనలు, మహిళలపై ద్వేషపూరిత వైఖరులను హైలైట్ చేస్తూ, ఇలాంటి సంఘటనలను కేవలం మరో వార్తగా చూడకూడదని, హానికరమైన ఆలోచనలను మార్చి మహిళలు సేఫ్‌గా ఉండే సమాజాన్ని నిర్మించాలన్నారు.



