శాంతి కోరుకుంటున్నవారంతా చేతులు కలపండి: కె.ఎ.పాల్
ప్రపంచవ్యాప్తంగా 58 యుద్ధాలు జరుగుతున్నాయని, 200కు పైగా దేశాల్లో కోట్లాది మంది నష్టపోతున్నారని ప్రజాశాంతి పార్టీ స్థాపకుడు కె.ఎ.పాల్ అన్నారు. యుద్ధాలతో ప్రపంచవ్యాప్తంగా ధరలు రెండు, మూడింతలు పెరిగాయన్నారు. సెప్టెంబర్ 23 సాయంత్రం అమెరికా వాషింగ్టన్‌లో శాంతి సందేశం ఇస్తున్నానని, శాంతి కోరుకుంటున్నవారంతా చేతులు కలపాలని వీడియో ద్వారా కోరారు. అమెరికన్ స్పీకర్ మైక్ జాన్సన్‌తో కలిసి ఈ సందేశం ఇస్తున్నానని తెలిపారు.



