← Back to news

బతుకమ్మ వేడుకలకు బిగ్ అరేంజ్‌మెంట్స్

By Somireddy Adavalli· 1h ago· Gajularamaram, Qutballapur, Medchal Malkajgiri
బతుకమ్మ వేడుకలకు బిగ్ అరేంజ్‌మెంట్స్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి నియోజకవర్గంలో జరగనున్న బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై MLA మాధవరం కృష్ణారావు గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. IDL రంగధాముని చెరువును సందర్శించి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ప్రతి ఏడాది కూకట్‌పల్లి నియోజకవర్గంలో పెద్దఎత్తున బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. వేడుకలకు వచ్చే మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

More in Local