CMకే ఫ్యూచర్ లేదు, ఇంకా ఫ్యూచర్ సిటీ ఏంటి: KTR

TG: CM రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అని ఊహల్లో బతుకుతున్నారని మాజీ మంత్రి KTR విమర్శించారు. ఎయిర్ పోర్ట్ మెట్రో పూర్తయితే ఇంత ట్రాఫిక్ ఉండదు, కానీ ఆ ప్రాజెక్టును రేవంత్ రెడ్డి ఆపేశారని ఆరోపించారు. ఉన్న హైదరాబాద్ నగరాన్ని గాలికి వదిలేసి ఫ్యూచర్ సిటీ అనడం ఏంటని ఫైరయ్యారు. హైదరాబాద్‌ను మరింతగా అభివృద్ధి చేస్తే సరిపోతుందన్నారు. రేవంత్ రెడ్డికే ప్యూచర్ లేదు ఇంకా ప్యూచర్ సిటీ ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ అసమర్థ పాలనతో రాష్ట్రం 40 ఏండ్లు వెనక్కి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్నటి ఒక్క వర్షానికే నగరం చెరువులను తలపించిందన్నారు.


