← Back to news

అదానీ వెనక్కి.. టిక్‌టాక్ బాస్ ముందుకు!

By Anusha· 2d ago
అదానీ వెనక్కి.. టిక్‌టాక్ బాస్ ముందుకు!

టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డాన్స్ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆయన సంపద 105 బిలియన్ డాలర్లకు పైగా ఉంది. దీంతో గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి తొలిసారి నెంబర్ వన్ ప్లేస్‌కు చేరుకున్నారు. అదానీ, ముకేశ్ అంబానీ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. బైట్‌డాన్స్ AI రంగంలో వేగంగా విస్తరించడం, డౌబావో AI చాట్‌బాట్, సీడాన్స్ వీడియో జనరేషన్ మోడళ్ల వృద్ధి జాంగ్ సంపద పెరగడానికి ప్రధాన కారణాలుగా రిపోర్ట్ పేర్కొంది.

More in Current Affairs