← Back to news

'DUNKI' ప్రయాణంలో ఊహించని షాక్..ముగ్గురు కిడ్నాప్

By Sharmila Skk· 1h ago· Indianexpress
'DUNKI' ప్రయాణంలో ఊహించని షాక్..ముగ్గురు కిడ్నాప్

అమెరికా వెళ్లేందుకు 'DUNKI' మార్గాన్ని ఎంచుకున్న గుజరాత్‌కు చెందిన ముగ్గురు బంధువులు ఎథియోపియాలో కిడ్నాప్‌కు గురయ్యారు. వాదాస్మా గ్రామానికి చెందిన మమత, రుత్విక్, మయూరి అక్కడి కిడ్నాపర్ల చెరలో చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న మెహసానా జిల్లా లాంగ్‌నాజ్ పోలీసులు ఫోన్‌లో కిడ్నాపర్లతో చర్చలు జరిపారు. పోలీసుల ప్రయత్నాలతో ముగ్గురూ సురక్షితంగా ఇండియా వచ్చి, అక్టోబర్ 1న వారు స్వగ్రామానికి చేరుకున్నారు.

More in National