8వ క్లాస్ డ్రాపౌట్.. కానీ డాక్టర్గా సర్జరీలు!

రాజస్థాన్లో 8వ తరగతితో చదువు ఆపేసిన 34 ఏళ్ల నానంజీరామ్ చౌదరి, నకిలీ సర్టిఫికెట్లతో డాక్టర్గా రిజిస్టర్ అయ్యి 100 బెడ్ల హాస్పిటల్ నడిపాడు. జాలోర్ జిల్లాలోని ఈ హాస్పిటల్లో డాక్టర్లను నియమించడంతో పాటు, తానే సర్జరీలు కూడా చేసినట్లు ఆరోపణలున్నాయి. నకిలీ MBBS డిగ్రీ, గైనకాలజీ డిప్లొమా వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో చౌదరితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. వీరి వల్ల ఎవరికైనా ప్రాణనష్టం జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.




