ఢిల్లీలో కాంగ్రెస్ ర్యాలీకి లైన్ క్లియర్!

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించిన ర్యాలీకి ఢిల్లీ పోలీసుల నుంచి పర్మిషన్ వచ్చింది. నవంబర్ 1న రామ్లీలా మైదాన్లో ఈ ర్యాలీ జరగనుంది. ఓటర్ లిస్ట్లలో మార్పుల కోసం చేపట్టిన SIR ప్రక్రియను వ్యతిరేకిస్తూ, ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లు వాడాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఈ ర్యాలీ నిర్వహించనుంది. ఇందుకోసం అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 వరకు మైదాన్ వాడుకునేందుకు పోలీసులు No Objection Certificate (NOC) ఇచ్చారు.


