బేబీ ఫుడ్లో షుగర్ వద్దంటున్న FSSAI!

చిన్న పిల్లలకు ఇచ్చే ఫుడ్లో అదనపు షుగర్ కలపకుండా ఉండేలా (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) FSSAI కొత్త రూల్ తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఆరు నెలల లోపు పిల్లల ఫుడ్లో సుక్రోజ్, ఫ్రక్టోజ్ అనే చక్కెరలను కలపడంపై బ్యాన్ విధించాలని ప్రతిపాదించింది. ఈ రూల్స్పై ప్రజలు, కంపెనీలు తమ అభిప్రాయాలు చెప్పేందుకు 60 రోజుల గడువు ఇచ్చింది. అయితే ఇది ఇంకా ప్రతిపాదన మాత్రమే.. ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.



