జాషువాకు భారతరత్న ఇవ్వాలి: డిమాండ్

మహాకవి గుర్రం జాషువాకు భారతరత్న ఇవ్వాలని దళిత ప్రజాసంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. వరంగల్ జిల్లాలోని పాకాల జంక్షన్‌లో జాషువా 131వ జయంతి నిర్వహించారు. సామాజిక అసమానతలపై ఆయన కలం ఆయుధమని, 'గబ్బిలం' రచన ప్రజల్లో చైతన్యం తెచ్చిందని కొనియాడారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ డా. గద్ద వెంకటేశ్వర్లు, ప్రణయ్‌దీప్ మాదిగ, అందే రవి, చింతం సిద్దు పాల్గొన్నారు.


