ఆదివాసి పెళ్లి వేడుకలు

పోలవరం జిల్లా చింతూరు పరిధిలోని కల్లేరులో ఆదివాసీ భీముని పెళ్లి వేడుకలు స్టార్ట్ అయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకలను సంప్రదాయ పద్ధతిలో పెళ్లి పందిరి వేసి ప్రారంభించారు. ఊరి పెద్దలు, బంధువులు, యూత్ అంతా కలిసి సంప్రదాయ పాటలు, డాన్సులు, పూజలతో హంగామా చేయడంతో కల్లేరులో పండుగ వాతావరణం నెలకొంది. రేపు కూడా ఈ వేడుకలు కొనసాగనున్నాయి.





