← Back to news

8 నెలల కష్టం వృథా... అయినా వెనక్కి తగ్గని బిట్టు!

By A.Ajay· 1h ago

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లాలో అజ్నార్‌ నదిని శుభ్రం చేసేందుకు సురేంద్ర సింగ్‌ చౌదరి అలియాస్‌ బిట్టు తబాహి 8 నెలల పాటు ఒంటరిగా శ్రమించారు. టన్నుల కొద్దీ చెత్తను తొలగించారు. కానీ కొన్ని వారాలకే నది ఒడ్డున మళ్లీ ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాలు పేరుకుపోయాయి. దీంతో తన కష్టం వృథా అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినా వెనక్కి తగ్గకుండా మళ్లీ నదిలోకి దిగి చెత్తను తొలగిస్తున్నారు. నదిలో చెత్త వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

More in National