పోషణ మాసం.. సీమంతాలు, అక్షరాభ్యాసాలు

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో మెగా పోషణ మాసం జరిగింది. సెక్టార్ సూపర్‌వైజర్ వసంత అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆహార పదార్థాల స్టాళ్లు ఏర్పాటు చేశారు. 12 మంది గర్భిణులకు సామూహిక సీమంతాలు, 12 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. పోషకాహార ప్రాధాన్యతపై సీడీపీఓ సత్యవతి తల్లులకు అవగాహన కల్పించారు. సర్పంచ్ వెంకటరెడ్డి చీర, సారె, పూలు, పండ్లు అందజేశారు. కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.




