← Back to news

అమ్మ వృద్ధాశ్రమంలో అన్నదానం

By KUCHIPUDI BUJJIBABU· 1h ago· Salivahanapeta, Mangalagiri, Guntur
అమ్మ వృద్ధాశ్రమంలో అన్నదానం

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం యర్రబాలెంలోని అమ్మ వృద్ధాశ్రమంలో దివంగత తాడిబోయిన గంగాధర్ యాదవ్ 13వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గంగాధర్ యాదవ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మంగళగిరికి చెందిన యాదవ సంఘం నాయకులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యఅతిథిగా హాజరైన CPI నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గంగాధర్ యాదవ్ విద్యార్థి నాయకుడిగా సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు యాదవ సంఘం అభివృద్ధికి సేవలందించారని తెలిపారు.

More in Local