15 ఏళ్ల బాలిక.. 4500 మందిలో భయం పోగొట్టింది

కర్ణాటకలోని మూడుబిద్రి ఆల్వాస్ సెంట్రల్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల విష్ణుప్రియ అరుదైన ఘనత సాధించింది. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 11 వరకు కర్ణాటకలోని 51 స్కూళ్లలో మానసిక ఆరోగ్యం/పరీక్షా ఒత్తిడి నిర్వహణపై వర్క్‌షాప్‌లు నిర్వహించింది. దాదాపు 4,500 మంది 8, 9వ తరగతి విద్యార్థులతో మాట్లాడి వాళ్లలో భయాలు పోగొట్టింది. ‘Golden Book of World Records’ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి త్వరలో సర్టిఫికేట్ ఇవ్వనుంది.



