TB నిర్మూలనకు అన్ని శాఖలు కలిసి పనిచేయాలి

కరీంనగర్ జిల్లాలో క్షయవ్యాధి (TB) నిర్మూలన కోసం మండల, బ్లాక్ స్థాయిలో JOSH (Joint Squad for Health) బృందాలను ఏర్పాటు చేసినట్లు DMHO డా. రాజగోపాల్ రావు తెలిపారు. కలెక్టర్ కాంప్లెక్స్ ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో టీబీని ముందుగానే గుర్తించడం, పరీక్షలు, చికిత్స, పోషకాహార సహాయం, ప్రజల్లో అవగాహనపై చర్చించారు. జిల్లా టీబీ అధికారి డా. హిమబిందు మాట్లాడుతూ.. యాక్టివ్ కేస్ ఫైండింగ్, స్క్రీనింగ్, ఛాతీ ఎక్స్‌రే, NAAT పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


