← Back to news

పిడుగు పడి గేదె మృతి

By YEDDULA RAMANJULU· 1h ago· Yandapalle, Rayachoti, Annamayya
పిడుగు పడి గేదె మృతి

అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం దిగువ అబ్బవరం గ్రామం దిగువ ఇందుకూరుపల్లెలో ఆదివారం పిడుగు పడటంతో సంబా రమణమ్మకు చెందిన గేదె మృతి చెందింది. చెట్టు కింద గేదెను కట్టివేసి ఉండగా ఒక్కసారిగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. గేదె మృతితో సుమారు 1 లక్ష వరకు నష్టం వాటిల్లిందని మహిళా రైతు రమణమ్మ తెలిపారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఆమె కోరారు.

More in Local