సుద్ధ వాగులో యథేచ్చగా ఇసుక తవ్వకాలు

నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ మండలం మోతక్‌పల్లి గ్రామ శివారులోని సుద్ధవాగులో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. భైంసా రూరల్, కుంటాల, నర్సాపూర్ మండలాల సరిహద్దులకు సమీపంలో ఉండటంతో అక్రమార్కులు ఆసరాగా చేసుకుంటున్నారని చెబుతున్నారు. వాగులో దాదాపు 5మీటర్ల లోతు వరకు ఇసుకను తవ్వుతున్నట్లు తెలిపారు. శనివారం రెవెన్యూ అధికారులు దాడులు చేసినా ఆదివారం సెలవు రోజు కావడంతో ఇసుక తవ్వకాలు చేస్తున్నారని స్థానికులు తెలిపారు.



