← Back to news

ఐదుగురి ప్రాణాలు తీసిన నూడిల్స్

By Vishi· 1h ago· Thedailyjagran
ఐదుగురి ప్రాణాలు తీసిన నూడిల్స్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడాలో దారుణం జరిగింది. రాత్రిపూట నూడిల్స్ తిన్న ఐదుగురు మృతి చెందారు. రబుపురా ప్రాంతానికి చెందిన మహేష్, భార్య లలిత, వారి ముగ్గురు పిల్లలు లడ్డు, మిష్టి, సాక్షత్ రాత్రి 10 గంటలకు ఇన్‌స్టంట్ నూడిల్స్ తిని నిద్రపోయారు. ఉదయం చుట్టుపక్కలవారు వెళ్లి చూడగా ఐదుగురు మరణించి ఉన్నారు. పోలీసులు ఆధారాలు సేకరించి, మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించారు. ఫుడ్ పాయిజన్ వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.

More in National