బాలీవుడ్ యాక్టర్‌కు బిగ్ షాక్

చెక్ బౌన్స్ కేసులో కోర్టు ఆదేశాల ప్రకారం పేమెంట్ చేయడంలో డిలే చేస్తున్న బాలీవుడ్ యాక్టర్ రాజ్ పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం ₹. 50 లక్షల డిమాండ్ డ్రాఫ్ట్ ఫోటోకాపీని బెంచ్ ముందుంచడంపై జస్టిస్ జైమాల్య బాగ్చీ తీవ్రంగా స్పందించారు. "ఈ అహంకారాన్ని అణచాల్సిన అవసరం ఉంది, ఎప్పుడు నోరు విప్పాలో తెలుసుకోండి" అంటూ లాయర్‌ను హెచ్చరించారు. బాధితుడికి మనీ అందాలనే ఉద్దేశంతోనే పిటిషన్ డిస్మిస్ చేయకుండా ఆగుతున్నామని, రేపటికల్లా సెటిల్ చేయాలని కోర్ట్ డెడ్‌లైన్ విధించింది.


