ఎమ్మెల్యే మాధవరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు

TG: వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని నల్లబెల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. నల్లబెల్లి గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేతో చర్చించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.



