తెలుగులోకి ‘ది ట్రైటర్స్’ షో

అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన రియాలిటీ షో ‘ది ట్రైటర్స్’ తొలిసారి తెలుగులోకి వస్తోంది. ప్రైమ్ వీడియోలో అక్టోబర్ 15, 2026 నుంచి ఈ షో స్ట్రీమింగ్ కానుంది. హీరో తేజ సజ్జ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. 20 మంది ప్రముఖులు పాల్గొనే ఈ షోలో నమ్మకం, వ్యూహాలు, రహస్యాలు, మోసం చుట్టూ గేమ్ సాగుతుంది. మొత్తం 10 ఎపిసోడ్లు నాలుగు వారాల్లో విడుదల కానున్నాయి. ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కొత్త ఎపిసోడ్ వస్తుంది. తెలుగులో ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.


