← Back to news

బొంబాయి పొట్టేలు – కథల పుస్తకం

By Vishi· 1d ago
బొంబాయి పొట్టేలు – కథల పుస్తకం

కథకుడు, చిత్రకారుడు చరణ్ పరిమి రాసిన రెండో కథల పుస్తకం ‘బొంబాయి పొట్టేలు’. రేగి అచ్చులు ప్రచురణ సంస్థ దీన్ని ప్రచురించింది. అబ్‌స్ట్రాక్ట్, సర్రియల్ టచ్‌తో సాగే ఈ కథలు సమాజంలోని అనేక కోణాలను కొత్తగా చూపిస్తాయి. అసమానతలు, వివక్ష, మనుగడ పోరాటాలను ఎదుర్కొనే పాత్రలు ఈ కథల్లో కనిపిస్తాయి. ఈ పుస్తకానికి రచయిత డా.వేంపల్లె షరీఫ్ ముందుమాట రాశారు. రచయిత చరిత్రను, ఆధిపత్య సంస్కృతి రాజకీయాలను అర్థం చేసుకుని రచయిత ఈ కథలు రాశారని ఆయన వివరించారు. దీని ధర రూ.170. పుస్తకం కొనే <a href="https://amzn.in/d/0dDm8w3U">లింక్</a>.

More in Arts/Literature

బడుగు జీవుల గురించి చెప్పే బలమైన కథలు
Arts/Literature· 12h ago

బడుగు జీవుల గురించి చెప్పే బలమైన కథలు

సదానంద్ శారదగా ప్రసిద్ధులైన పాకాల సదానంద్‍ తెలంగాణలో పేరెన్నికగన్న కథకుడు. ‘జాడీ’ కథతో ప్రజాదరణ పొందిన ఆయన దాదాపు 150 కథల వరకు రాశారు. ఆయన కథలను ‘సదానంద్ శారద కథలు’ పేరిట నవచేతన ప్రచురణ సంస్థ కథాసంపుటిగా తీసుకొచ్చింది. ఆకలి, దారిద్ర్ర్యం, వెట్టిచాకిరీ, అవమానాలు, ఆత్మహత్యలతో ముగిసిన జీవితాల గురించి లోతైన తాత్వికత ఈ కథల్లో ఉంటుంది. బడుగు జీవులు బానిస సంకెళ్లను తెంచుకొని స్వేచ్ఛగా బతకడం ఆయన కథల్లో కనిపిస్తుంది. పుస్తకం ధర 180 రూపాయలు. కొనే <a href="https://newvishalandhrabooks.com/product/sadanand-sarada-kathalu-%E0%B0%B8%E0%B0%A6%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D-%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A6-%E0%B0%95%E0%B0%A5%E0%B0%B2%E0%B1%81/">లింక్</a>.