నిర్లక్ష్యం చేస్తే సస్పెన్షన్.. అధికారులకు సీఎం హెచ్చరిక!

తెలంగాణలో కరెంటు కోతలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలు చేతికొచ్చే వరకు కరెంటు కోతలు లేకుండా చూడాలని ఆదేశించారు. వచ్చే 20 రోజులు పంటలకు చాలా కీలకమని, విద్యుత్ ఉత్పత్తి పెంచాలని స్పష్టం చేశారు. రోజుకో కారణం చెప్పొద్దని హెచ్చరించారు. ఎల్నినో ప్రభావంతో తాగునీరు, పశుగ్రాసం కొరత రాకుండా జూన్ వరకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. నిర్లక్ష్యం చేస్తే ఉన్నతాధికారులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.



