ఇండియాలో స్టార్‌లింక్ సేవలు వద్దంటున్న RSS అనుబంధ సంస్థ!

ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌కు ఇండియాలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు స్టార్ట్ చేసేందుకు అనుమతులు ఇవ్వొద్దని RSS అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్ (SJM) కేంద్రాన్ని కోరింది. స్టార్‌లింక్ వల్ల దేశ భద్రత, డేటా ప్రైవసీ విషయంలో ఇబ్బందులు రావొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఎమర్జెన్సీ టైమ్‌లో ఇంటర్నెట్‌ను కంట్రోల్ చేయడం, దేశ డేటాను సేఫ్‌గా ఉంచడం కష్టమవ్వొచ్చని తెలిపింది. అందుకే అనుమతులు ఇవ్వొద్దని డిమాండ్ చేసింది.



