BJP, మోదీని తక్కువ చేసి చూడొద్దు: అమిత్ షా

SIR ప్రాసెస్‌ను సాకుగా చూపిస్తూ BJP, మోదీ ప్రజాదరణను తక్కువ చేసి చూడొద్దని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిలో జరిగిన బైపోల్స్‌లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో BJP భారీ మెజారిటీలతో గెలిచారని తెలిపారు. గత 41 ఏళ్లుగా గుజరాత్‌లో కాంగ్రెస్ గెలవలేకపోయిందని అమిత్ షా అన్నారు.



