← Back to news

గంజాయి చాక్లెట్లు, సిగరెట్లు.... ఇద్దరు అరెస్ట్!

By Somireddy Adavalli· 1h ago· Quthbullapur, Pudur, Vikarabad
గంజాయి చాక్లెట్లు, సిగరెట్లు.... ఇద్దరు అరెస్ట్!

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్లు, సిగరెట్లు అమ్మకాలు జరుపుతున్న ఇద్దరు వ్యక్తులను డిటిఎఫ్ టీమ్ పట్టుకుంది. ఒరిస్సాకు చెందిన నిందితులు హెచ్. కుంతియా, సుఖనాథ్ వద్ద 500 గ్రాముల గంజాయి సిగరెట్లు, 1.052 కేజీల గంజాయి చాక్లెట్లను పట్టుకున్నారు. వీటితోపాటు రూ.1.45 లక్షల నగదును కూడా సీజ్ చేశారు. నిందితులను, నగదును బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.

More in Local