← Back to news

సంక్షేమ హాస్టల్‌పై ఆకస్మిక తనిఖీ.. ఎంపీడీవో సీరియస్!

By Srinivasarao· 1h ago· Pinampally, Tirumalayapalem, Khammam
సంక్షేమ హాస్టల్‌పై ఆకస్మిక తనిఖీ.. ఎంపీడీవో సీరియస్!

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం గ్రామంలోని సంక్షేమ హాస్టల్‌ను ఎంపీడీవో షేక్ సిలార్ సాహెబ్, సర్పంచ్ ధరావత్ సుజాత నర్సింహారావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్సీ బాలికల వసతి గృహం, గిరిజన గురుకుల బాలుర వసతి గృహంలో సౌకర్యాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. తనిఖీల్లో పంచాయతీ కార్యదర్శి రమేష్, ఏఎన్ఎం నాగలక్ష్మి, ఆశ కార్యకర్తలు, కాంగ్రెస్ మండల నాయకులు దరావత్ సంతోష తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ హాస్టల్‌పై ఆకస్మిక తనిఖీ.. ఎంపీడీవో సీరియస్!

More in Local