5 కోట్ల రూపాయిల ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం

ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయని నమ్మించి 'ASPECT TRADER' యాప్‌తో దాదాపు 5 కోట్ల రూపాయిల మోసం చేసిన చల్గల్‌కు చెందిన మానాల మారుతిని జగిత్యాల టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. రోజుకు 1శాతం లాభం, 100 రోజుల్లో ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్ ఇస్తామని నమ్మించి మోసానికి పాల్పడ్డాడు. నిందితుడిని కస్టడీలోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు CI కరుణాకర్ తెలిపారు. ఇలాంటి డౌట్‌ఫుల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై అలర్ట్‌గా ఉండాలని హెచ్చరించారు.



