← Back to news

SIRకు వ్యతిరేకంగా అక్టోబర్ 3న హైదరాబాద్‌లో నిరసన

By A.Ajay· 2h ago
SIRకు వ్యతిరేకంగా అక్టోబర్ 3న హైదరాబాద్‌లో నిరసన

TG: హైదరాబాద్‌లో అక్టోబర్ 3న SIRపై నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్, ఇతర సంఘాలు ప్రకటించాయి. ఇందిరాపార్క్ వద్ద ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. CEC రాజీనామా చేయాలని, SIRను రద్దు చేయాలని, 2023 ఎన్నికల కమిషనర్ల చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఓటు హక్కును కాపాడాలని వారు కోరుతున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రజలు పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

More in TG