← Back to news

SRFTI గేట్ వద్ద హై టెన్షన్

By Nani Eluri· 1h ago· X

కోల్‌కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌ (SRFTI)లో సెప్టెంబర్ 27న ఓ కార్యక్రమం విషయంలో విద్యార్థులు, ABGP సభ్యుల మధ్య గొడవ జరిగింది. తమపై కర్రలు, రాళ్లు, కత్తులతో దాడి చేశారని విద్యార్థులు ఆరోపిస్తే.. విద్యార్థులే తమపై దాడి చేసి భారతమాత, స్వామి వివేకానంద చిత్రాలను ధ్వంసం చేశారని ABGP ఆరోపించింది. దీనిపై FIRలు, SIT దర్యాప్తు కొనసాగుతున్నాయి. అక్టోబర్ 4న హిందూ జాగరణ్ మంచ్ SRFTI వద్ద నిరసనకు దిగింది. గేట్ దాటి లోపలికి వెళ్లే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

More in National