← Back to news

హైదరాబాద్‌లో ఒకే రోజు 4 నిరసనలు, ఒకే లక్ష్యం!

By tc· 21 Jul 2026· TG
హైదరాబాద్‌లో ఒకే రోజు 4 నిరసనలు, ఒకే లక్ష్యం!

ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఛలో పార్లమెంటుపై కేంద్ర అణచివేత చర్యలు, విద్యార్థులపై లాఠీచార్జ్ కి నిరసనగా హైదరాబాద్‌ లో ఈ రోజు (జూలై 21న) 4 వేర్వేరు ఆందోళనలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్, 4 గంటలకు గచ్చిబౌలి, 5 గంటలకు సచివాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు మార్చ్, 5:30కు నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో భారీ ర్యాలీలు ఉంటాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ అనే ఏకైక లక్ష్యంతో ఈ నాలుగు కార్యక్రమాలను సివిల్ సొసైటీ అంటే వివిధ వర్గాల ప్రజలు చేపట్టారు. విద్యార్థులు, మేధావులు, తల్లిదండ్రులు ఈ నిరసనల్లో పాల్గొంటారు.

More in General