43 మంది పోలీసులకు సన్మానం

ప్రపంచ శాంతి దినోత్సవం సందర్భంగా కాకినాడలో MPJ ఆధ్వర్యంలో 43 మంది ఉత్తమ పోలీసులను ఘనంగా సన్మానించారు. 15 స్టేషన్లలో డ్యూటీలో నిబద్ధత చూపించిన వారికి అదనపు SP కిషోర్ కుమార్, DSP శ్రీహరి రావు బహుమతులు అందించారు. పబ్లిక్ సేఫ్టీ, శాంతిభద్రతల కోసం రాత్రింబవళ్లు శ్రమించే పోలీసుల సేవలు అభినందనీయమని MPJ అధ్యక్షుడు మొహమ్మద్ హలీమ్ కొనియాడారు.




