← Back to news

నర్సాపూర్‌లో గణేష్ నిమజ్జన గొడవలు

By Jabeer· 50m ago· నిర్మల్
నర్సాపూర్‌లో గణేష్ నిమజ్జన గొడవలు

నిర్మల్ జిల్లా రాంపూర్ గ్రామంలో గణేష్ నిమర్జనంలో వివాదం పెరిగి దాడులకు దారితీసింది. సత్యనారాయణకు సపోర్ట్ చేశాడనే కోపంతో సాయన్న వర్గం ర్యాపని బాబు ఇంటిపై దాడి చేసి, అతడితో పాటు భార్య, అన్నను గాయపరిచారు. దీనిపై బాధితులు పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఆ మరుసటి రోజు ప్రతీకారంగా బాబు వర్గం రాళ్లతో దాడి చేసి, చిన్న గంగారం కొడుకు రవి, ఆయన భార్యను కర్రలతో కొట్టారు. రెండు వైపులా దాడులపై పోలీసులు కేసులు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు.

More in Local