← Back to news

మాతా–శిశు సంక్షేమానికి కొత్త అడుగు

By Mahesh· 20 Jul 2026· AP
మాతా–శిశు సంక్షేమానికి కొత్త అడుగు

AP: మాతా శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులు, బాలింతలకు రవాణా సేవల్ని అందించేందుకు 'తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్' వాహనాలను అందుబాటులోకి తెస్తోంది. ఈ వాహనాలను సీఎం చంద్రబాబునాయుడు సీఎం క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా 500 ప్రత్యేక SUV/MUV వాహనాలను వినియోగించనున్నారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ వీరపాండ్యన్, ఉన్నతాధికారులు, జాతీయ ఆరోగ్య మిషన్ అధికారులు పాల్గొన్నారు.

More in Politics