మీనాక్షి నటరాజన్ అంశంలోనూ సిట్ వేయాలి: KTR

TG: మీనాక్షి నటరాజన్‌ను రాజ్యసభకు వెళ్లకుండా అడ్డుకున్న అంశంపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిదానికి సిట్ వేస్తుంది కదా.. ఆ పార్టీ నాయకురాలు మీనాక్షి నటరాజన్ అంశంపై కూడా సిట్ వేయాలని అన్నారు. బీజేపీలో ఎవరికి ఫ్రెండ్స్ ఉన్నారో మీనాక్షి నటరాజన్ అంటే ఎవరికి కోపం ఉందో వాళ్లే కేసు గురించి ఎన్నికల కమిషన్‌కు చెప్పి ఉంటారన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పార్టీ ద్రోహులు ఎవరో కనుక్కోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కంపు, అలాంటి కాంగ్రెస్ కంపులో ద్రోహుల పార్టీ అంశంలో మమ్మల్ని ఎందుకు లాగుతున్నారని ఫైరయ్యారు.


