← Back to news

ఆగస్టు 21 నుంచి బుక్ బ్రహ్మ సాహిత్యోత్సవం

By Vishi· 19 Aug 2026
ఆగస్టు 21 నుంచి బుక్ బ్రహ్మ సాహిత్యోత్సవం

బుక్ బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్(Book Brahma Literature Festival) మూడో ఎడిషన్ ఆగస్టు 21, 22, 23వ** తేదీల్లో బెంగళూరు కోరమంగలలోని సెయింట్ జాన్స్ ఆడిటోరియంలో జరగనుంది. దీనికి ప్రవేశం పూర్తిగా ఉచితం. ఈ ఏడాది ఉత్సవానికి ‘Linguistic Hegemony’ అనే థీమ్‌ను ఎంచుకున్నారు. వివిధ భాషలు, సంస్కృతులు, కథల మధ్య ఉన్న సంబంధాలు, భాషా ప్రాబల్యం అంశాలపై దృష్టి సారించనున్నారు. ఈ ఉత్సవంలో కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు, ఇంగ్లిష్, బెంగాలీ వంటి భాషల్లో సాహిత్య చర్చలు, సెషన్లు జరుగుతాయి. పూర్తి వివరాలకు <a href="https://www.bookbrahmalitfest.com/">వెబ్‌సైట్</a> చూడొచ్చు.

More in Arts/Literature