గామలపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామలపాడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కూటమి నాయకులు సుబ్బారావు, శీను, జానకి రామయ్య, సాంబ వెంకటేశ్వరరావు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గురజాల MLA యరపతినేని శ్రీనివాసరావు గామలపాడు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.


