కొత్త సబ్స్క్రిప్షన్లకు బ్రేక్

బంగారంలో పెట్టుబడులు పెరగడంతో పలు మ్యూచువల్ ఫండ్ సంస్థలు కొత్త పెట్టుబడులపై తాత్కాలిక ఆంక్షలు విధించాయి. నిన్నటి నుంచి గోల్డ్ ETF ఫండ్ ఆఫ్ ఫండ్స్లో కొత్తగా ఒకేసారి పెట్టుబడులు పెట్టడం, కొత్త SIPలు ప్రారంభించడం, ఇతర పథకాల నుంచి పెట్టుబడులను మార్చడం నిలిపివేశాయి. ఇప్పటికే కొనసాగుతున్న SIPలు, పెట్టుబడుల ఉపసంహరణకు మాత్రం అనుమతి ఉంది. అయితే, స్టాక్ మార్కెట్లో గోల్డ్ ETFలను కొనుగోలు చేయడంపై ఈ ఆంక్షలు వర్తించవు.



