← Back to news

ఆందోళనల మధ్య ఆధ్యాత్మికత అవసరం

By Krischna· 54m ago· Mahabubnagar
ఆందోళనల మధ్య ఆధ్యాత్మికత అవసరం

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జేజేఆర్ ఫంక్షన్ హాల్‌లో రెమా వర్షిప్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడురోజుల ఉపవాస ప్రార్థన పండుగ ముగిసింది. డైరెక్టర్ పాస్టర్ బీఎస్ పరంజ్యోతి అధ్యక్షతన జరిగిన ముగింపు కార్యక్రమానికి పాస్టర్ ప్రశాంత్ జోషి హాజరై మాట్లాడారు. నేటి సమాజంలో అనేక సమస్యలు, ఒత్తిళ్లు, ఆందోళనలతో ప్రజలు సతమతం అవుతున్నారని, ఒత్తిళ్లను అధిగమించేందుకు ఆధ్యాత్మిక చింతన ఎంతో అవసరమని తెలిపారు.

More in Local