Latest

'Monsoon Day' celebrations🌧️☔
Local· 25 Aug 2026

'Monsoon Day' celebrations🌧️☔

TG : వరంగల్ జిల్లా నర్సంపేటలోని బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్లో 'Monsoon Day' వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. విద్యార్థులు రైన్ కోట్లు వేసుకొని, గొడుగులు పట్టుకుని చినుకుల్లో పాటలు పాడుతూ, ఆడుతూ ఎంజాయ్ చేశారు. కాగితపు పడవలు చేసి నీటిలో వదులుతూ ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ కార్యక్రమంలో బాలాజీ విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ ఏ. రాజేంద్రప్రసాద్ రెడ్డి, ట్రెజరర్ వనజా రెడ్డి, ప్రిన్సిపాల్ జ్యోతి, టీచర్లు పాల్గొన్నారు.

Stock Market మళ్లీ గ్రీన్‌లోకి..
Personal Finance· 25 Aug 2026

Stock Market మళ్లీ గ్రీన్‌లోకి..

ఉదయం మార్కెట్ కాస్త డల్‌గా కనిపించినా.. చివర్లో ఒక్కసారిగా పికప్ అయింది! 👀 Sensex 287 పాయింట్లు పెరిగి 77,656 దగ్గర క్లోజ్ అవ్వగా, Nifty 116 పాయింట్లు ఎగబాకి 24,335కు చేరింది. ప్రధాన కారణం క్రూడ్ ఆయిల్ ధరలు 3% పడిపోయి బ్యారెల్‌కు $90 కంటే దిగువకు రావడం. ఇరాన్‌పై అమెరికా ఆంక్షల ప్రభావం చమురు సరఫరాపై పెద్దగా ఉండకపోవచ్చన్న అంచనాలు కూడా మార్కెట్‌కు కాస్త ఊరటనిచ్చాయి. రూపాయి బలపడటం, చివర్లో కొనుగోళ్లు పెరగడం కూడా కలిసొచ్చాయి.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు నాగర్‌కర్నూల్ Students
Local· 25 Aug 2026

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు నాగర్‌కర్నూల్ Students

TG : హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ నెల 26, 27 తేదీల్లో 12వ తెలంగాణ స్టేట్ యూత్ జోన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ జరగనుంది. నాగర్‌కర్నూల్ లక్ష్య అథ్లెటిక్స్ కోచింగ్ సెంటర్ నుంచి నలుగురు ఎంపికయ్యారు. అండర్–14 ట్రయాథ్లాన్‌లో నవదీప్, అండర్–16 (600 మీటర్లు)లో గణేష్, అండర్–20 (400 మీటర్లు)లో అజయ్, అండర్–20 (3 కిమీ పరుగు)లో నవీన్ ఎంపికైనట్లు కోచ్ రానా మల్లేష్ తెలిపారు. కష్టపడి ఆడి స్టేట్ లెవెల్లో మెడల్స్ గెలిచి నేషనల్ లెవెల్‌కి వెళ్లాలని కోచ్ Students కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

నీటిలో చిక్కుకున్న స్కూల్ బస్సు
National· 25 Aug 2026

నీటిలో చిక్కుకున్న స్కూల్ బస్సు

భారీ వర్షంతో రోడ్లపై నీరు చేరడంతో గురుగ్రామ్‌లో స్కూల్ బస్సులు మధ్యలోనే ఆగిపోయాయి. ఒక బస్సులో పిల్లలు దాదాపు నాలుగు గంటల పాటు చిక్కుకుపోయారు. 👀 తల్లిదండ్రులు స్కూల్, అధికారులకు వరుసగా ఫోన్లు చేస్తుండగా.. నీరు ఎక్కువగా ఉండటంతో సాధారణ వాహనాలు అక్కడికి చేరలేకపోయాయి. చివరికి అధికారులు క్రేన్‌ను తీసుకొచ్చి బస్సును ముందుకు జరిపారు. ఆ తర్వాత పిల్లలను మరో బస్సులోకి మార్చి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనతో తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

మన భవిష్యత్తుపై వాళ్లకే కంట్రోలా?
Technology· 25 Aug 2026

మన భవిష్యత్తుపై వాళ్లకే కంట్రోలా?

మన ఫోన్‌లో ఏం కనిపించాలి దగ్గర నుంచి.. రేపటి ఉద్యోగాలు ఎలా మారాలి వరకు AI ప్రభావం పెరుగుతోంది. కానీ ఈ టెక్నాలజీ మొత్తం కొద్దిమంది కంపెనీలు లేదా వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతే? ఇదే విషయంలో OpenAI CEO సామ్ ఆల్ట్‌మన్ ఆందోళన వ్యక్తం చేశారు. AI ఎలా ఎదగాలి, సమాజంపై దాని ప్రభావం ఎలా ఉండాలి అనే నిర్ణయాల్లో ప్రజలకూ భాగం ఉండాలని ఆయన అన్నారు. AIపై నిర్ణయాలు కొద్దిమంది తీసుకుంటే.. దాని లాభాలు, నష్టాలు వాళ్ల నిర్ణయాలపైనే ఆధారపడొచ్చు. AI మన కోసం పనిచేయాలి.. మన భవిష్యత్తును మనకు తెలియకుండానే నిర్ణయించకూడదు.

ఫ్రీ కుట్టు మిషన్లు: మిస్ అవ్వకండి!
TG· 25 Aug 2026

ఫ్రీ కుట్టు మిషన్లు: మిస్ అవ్వకండి!

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ మహిళల ఉపాధి కోసం 'ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం' ప్రారంభించింది. BC ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అమలు కానున్న ఈ స్కీమ్‌కి 18–55 ఏళ్ల మహిళలు అర్హులు. సంవత్సర ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో ₹1.50 లక్షలు, పట్టణాల్లో ₹2.00 లక్షలుగా నిర్ణయించారు. ఆధార్, రేషన్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉన్నవారు <a href="https://tgobmms.cgg.gov.in/">TGOBMMS</a> పోర్టల్‌లో సెప్టెంబర్ 15, 2026 లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చని BC కార్పొరేషన్ MD డాక్టర్ మల్లయ్య భట్టు తెలిపారు.

నేత్రదానం చేయండి.. ఇద్దరికి చూపు ఇవ్వండి: DMHO డాక్టర్ కృష్ణ
Local· 25 Aug 2026

నేత్రదానం చేయండి.. ఇద్దరికి చూపు ఇవ్వండి: DMHO డాక్టర్ కృష్ణ

TG : కళ్లు దానం చేస్తే ఇద్దరు అంధులకు చూపు ఇవ్వవచ్చని నాగర్‌కర్నూల్ DMHO డాక్టర్ కె. కృష్ణ చెప్పారు. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరుగుతున్న నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా పాలెం ZPHS స్కూల్‌లో అవేర్‌నెస్ ర్యాలీ నిర్వహించారు. మనిషి చనిపోయిన 6 గంటల్లోపే కళ్లు దానం చేయడం చాలా ముఖ్యం. అందరూ నేత్రదానంపై అవగాహన పెంచుకోవాలని కోరారు. ఈ ప్రోగ్రామ్‌లో డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి, డాక్టర్ ప్రియాంక, హెల్త్ స్టాఫ్ పాల్గొన్నారు.

Studentsతో కలిసి మొక్కలు నాటిన కలెక్టర్
Local· 25 Aug 2026

Studentsతో కలిసి మొక్కలు నాటిన కలెక్టర్

TG : భవిష్యత్ తరాల కోసం అందరూ మొక్కలు నాటి కాపాడాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ పిలుపునిచ్చారు. పెద్ద ముద్దునూరు ZPHS పాఠశాలలో జరిగిన వన మహోత్సవంలో విద్యార్థులతో కలిసి ఆయన 100 మొక్కలు నాటారు. ప్రతి స్టూడెంట్ ఒక మొక్కను నాటి ఇంట్లో మనిషిలా చూసుకోవాలని, ఆక్సిజన్, మంచి వర్షాల కోసం చెట్లు చాలా ముఖ్యమని చెప్పారు. పాఠశాలలు, ఆఫీసుల్లో ప్లాంటేషన్ పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ ఆఫీసర్ రేవంత్ చంద్ర, సర్పంచ్ ఊర్మిలమ్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

CJP బిగ్ అనౌన్స్‌మెంట్
National· 25 Aug 2026

CJP బిగ్ అనౌన్స్‌మెంట్

కాక్రోచ్ జనతా పార్టీ (CJP)కి చెందిన <a href="https://x.com/whattalawyer/status/2092210947763155417?s=20">రత్న సింగ్</a> తమ లీగల్ ఎయిడ్ వెబ్‌సైట్ (<a href="https://cjplegalaid.com/">cjplegalaid.com</a>)ను అధికారికంగా లాంచ్ చేశారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం వాయిస్ రైజ్ చేసేటప్పుడు పోలీస్ కేస్, అరెస్ట్ లేదా హెరాస్‌మెంట్ ఫేస్ చేస్తున్న సపోర్టర్స్, వాలంటీర్లకు ఉచిత లీగల్ సపోర్ట్ ఇవ్వడమే దీని మెయిన్ ఎయిమ్. సీనియర్ అడ్వకేట్స్ ద్వారా వెరిఫైడ్ లీగల్ హెల్ప్ అందించేందుకు ఈ నేషన్ వైడ్ లీగల్ నెట్‌వర్క్‌ను స్టార్ట్ చేసినట్లు ఆమె తెలిపారు.

లోకాయుక్తగా జస్టిస్ మల్లిఖార్జునరావు ప్రమాణ స్వీకారం
Local· 25 Aug 2026

లోకాయుక్తగా జస్టిస్ మల్లిఖార్జునరావు ప్రమాణ స్వీకారం

AP : ఆంధ్రప్రదేశ్ నూతన లోకాయుక్తగా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ తల్లాప్రగడ మల్లిఖార్జునరావు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని లోక్‌భవన్‌ దర్బార్‌ హాల్‌లో గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించగా, CM చంద్రబాబు నాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్‌లో మంత్రి వాసంశెట్టి సుభాష్, హైకోర్టు జడ్జీలు, DGP హరీష్‌కుమార్ గుప్తా, అధికారులు హాజరయ్యారు.

55 లక్షల తాటి చెట్లు నాటడమే టార్గెట్
Local· 25 Aug 2026

55 లక్షల తాటి చెట్లు నాటడమే టార్గెట్

AP : తుఫాను గాలులు, తీర ప్రాంత కోతను అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం ‘గ్రేట్ గ్రీన్ వాల్’ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. తీర ప్రాంతంలో నేచురల్ రక్షణగా 5,499 హెక్టార్లలో 55 లక్షల తాటి గింజలు నాటాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటికే 13 లక్షల తాటి గింజలు కలెక్ట్ చేసి, అందులో 1.65 లక్షలు నాటారు. ప్రకృతి విపత్తుల నుంచి మన తీరాన్ని కాపాడుకోవడానికి ప్రతీ ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

ఆన్‌లైన్ డెలివరీ యాప్స్‌కి బిగ్ షాక్!
Current Affairs· 25 Aug 2026

ఆన్‌లైన్ డెలివరీ యాప్స్‌కి బిగ్ షాక్!

ఆన్‌లైన్‌లో పాయిజనస్ 'ఉమ్మెత్త' కాయలు, విత్తనాలు అమ్మడంపై కర్ణాటక ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ సీరియస్ అయింది. నిబంధనలు ఉల్లంఘించిన అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్ యాప్స్ లైసెన్సులను సస్పెండ్ చేస్తూ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కె. శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫుడ్ సేఫ్టీ యాక్ట్ 2006 కింద ఈ ప్లాట్‌ఫామ్స్ నుండి ఉమ్మెత్త ప్రొడక్ట్స్, యాడ్స్‌ను వెంటనే రిమూవ్ చేయాలని, వీటి సేల్స్ స్టాప్ చేయాలని ఆదేశించారు.

ఆశా వర్కర్ల ధర్నాకు ఎమ్మెల్యే సంజయ్ సపోర్ట్
Local· 25 Aug 2026

ఆశా వర్కర్ల ధర్నాకు ఎమ్మెల్యే సంజయ్ సపోర్ట్

TG : హైదరాబాద్‌లోని మెడికల్ కౌన్సిల్ ఆఫీస్ ముందు ఆశా వర్కర్లు చేసిన ధర్నాకు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ సపోర్ట్ ఇచ్చారు. ఈ నిరసనలో ఆయన కూడా స్వయంగా పాల్గొని మాట్లాడారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని, కరోనా టైమ్‌లో ప్రాణాలకు తెగించి సేవలు చేశారని చెప్పారు. ప్రభుత్వం వారిపట్ల చిన్నచూపు చూడటం కరెక్ట్ కాదని, వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, ఆశా వర్కర్ల పోరాటానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు.

ఇండియా vs శ్రీలంక: కొలంబోలో టీమిండియా డామినేషన్!
Sports· 25 Aug 2026

ఇండియా vs శ్రీలంక: కొలంబోలో టీమిండియా డామినేషన్!

ఇండియా, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ 3వ రోజు టీ టైమ్‌కి ఇండియన్ బౌలర్లు బీస్ట్ మోడ్‌లోకి వెళ్లారు. ప్రసిద్ధ్ కృష్ణ, అదర్ బౌలర్స్ కంబైన్డ్ అటాక్‌తో శ్రీలంక టీమ్‌ను 216/7 రన్స్‌కే కట్టడి చేసి మ్యాచ్‌పై ఫుల్ గ్రిప్ సాధించారు. శ్రీలంక టీమ్ ఇంకా 287 రన్స్ వెనుకంజలో ఉంది. క్రీజులో సోనాల్ దినూష (52), కేశర నువాంత (13) బ్యాటింగ్ చేస్తున్నారు. కొలంబో వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో ఇండియా కంప్లీట్ డామినేషన్ చూపిస్తోంది.

అరెస్ట్ చేస్తారా? చెయ్యండి- CJP స్పోక్స్ పర్సన్
Education· 25 Aug 2026

అరెస్ట్ చేస్తారా? చెయ్యండి- CJP స్పోక్స్ పర్సన్

రాజస్థాన్ ప్రభుత్వ స్కూళ్ల కండిషన్‌పై వాయిస్ రైజ్ చేస్తున్న CJP స్పోక్స్ పర్సన్ <a href="https://x.com/AshutoshRanka/status/2092199495174082720?s=20">అశుతోష్ రాంకా</a>, తన ఇంటి ముందు రాజస్థాన్ పోలీసులు నిఘా పెట్టడంపై 'X' వేదికగా స్పందించారు. రాజస్థాన్ పోలీసులు ధైర్యంగా వచ్చి తనను అరెస్ట్ చేసుకోవచ్చని, అంతేకానీ ఇటువంటి బెదిరింపులకు భయపడేది లేదని ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి మెరుగుపడే వరకు తమ టీమ్ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.

జల్ జీవన్ మిషన్ కాంట్రాక్టర్ల నిరసన
Local· 25 Aug 2026

జల్ జీవన్ మిషన్ కాంట్రాక్టర్ల నిరసన

AP : అమరావతిలో జల్ జీవన్ మిషన్ కింద గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి పనులు చేసిన కాంట్రాక్టర్లు తమకు రావాల్సిన బిల్లుల కోసం మంగళగిరిలో నిరసన తెలిపారు. 2024 నవంబర్ నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ ప్రకారం పెండింగ్‌లో ఉన్న రూ.4,133 కోట్ల బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్య తీరేవరకు ఈ ఆందోళనను ఇలాగే కొనసాగిస్తామని అన్నారు.

గ్రూపు రాజకీయాలు వద్దు.. అభివృద్ధి కావాలి
Local· 25 Aug 2026

గ్రూపు రాజకీయాలు వద్దు.. అభివృద్ధి కావాలి

TG : వరంగల్ తూర్పు నియోజకవర్గ నాయకులు గ్రూపు రాజకీయాలు పక్కనబెట్టి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఆక్టివిస్ట్ డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్ కోరారు. ‘మాకు మీ గ్రూపు రాజకీయాలు వద్దు.. అభివృద్ధి కావాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు, నాణ్యమైన విద్య, వైద్యం అందాలి. గొడవలు లేకుండా రక్షణగా ఉండాలి’ అని ఆయన ప్లకార్డులతో డిమాండ్ చేశారు. లీడర్లు ప్రజల అవసరాలను గుర్తించి ఏరియా డెవలప్‌మెంట్ కోసం కష్టపడాలని అన్నారు.

మారుతున్న గవర్నమెంట్ స్కూళ్లు?
Education· 25 Aug 2026

మారుతున్న గవర్నమెంట్ స్కూళ్లు?

UP యోగి ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్స్‌కు రూ.604 కోట్ల బడ్జెట్‌ను అప్రూవ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,126 ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో పాతబడిన క్లాస్‌రూమ్‌లను రీబిల్డ్ చేసి, మోడర్న్ ఫెసిలిటీస్ కల్పించడమే ఈ ప్రాజెక్ట్ మెయిన్ ఎయిమ్. పనులు వెంటనే స్టార్ట్ అయ్యేలా బేసిక్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌గా రూ.302 కోట్లను ఆల్రెడీ రిలీజ్ చేసింది. దీనివల్ల స్టూడెంట్స్ కు సేఫ్ అండ్ బెటర్ లెర్నింగ్ స్పేస్ అందుబాటులోకి రానుంది.

కార్గో ఎయిర్‌పోర్ట్ వద్దు
Local· 25 Aug 2026

కార్గో ఎయిర్‌పోర్ట్ వద్దు

AP : శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఉద్దానాన్ని నాశనం చేసే కార్గో ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదనను క్యాన్సిల్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 8న అన్ని గ్రామాల్లో కళ్లకు గంతలు కట్టుకుని నిరసనలు తెలపాలని పోరాట కమిటీ పిలుపునిచ్చింది. కమిటీ ప్రెసిడెంట్ కొమర వాసు, సెక్రటరీ జోగి అప్పారావు ఆధ్వర్యంలో పలాసలో మీటింగ్ జరిగింది. ఎయిర్‌పోర్ట్ కోసం ల్యాండ్స్ తీసుకుంటే రైతులు, కూలీలు ఉపాధి కోల్పోతారని నేతలు భయపడుతున్నారు. భూముల జోలికి వస్తే తిరుగుబాటు తప్పదని ప్రజా సంఘాలు, నాయకులు హెచ్చరించారు.

రక్షా బంధన్‌ యాడ్‌పై కృతి సనన్‌ క్లారిటీ.. ఏమన్నారంటే?
National· 25 Aug 2026

రక్షా బంధన్‌ యాడ్‌పై కృతి సనన్‌ క్లారిటీ.. ఏమన్నారంటే?

కృతి సనన్‌ రక్షా బంధన్‌ యాడ్‌పై వచ్చిన విమర్శలకు రెస్పాండ్ అయ్యారు. యాడ్‌లో తన బట్టలపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేయగా, కంగనా రనౌత్‌ కూడా విమర్శలు చేశారు. దీనిపై కృతి మాట్లాడుతూ.. పండుగల స్ఫూర్తి వేసుకునే బట్టల్లో కాదు, మనసులోని భావాలు, బంధాలు, సంప్రదాయాల్లో ఉంటాయని కౌంటర్ ఇచ్చారు. మహిళలు ఏం ధరించాలనే విషయంపై సమాజం ఎప్పుడూ సూచనలు చేస్తుందని ప్రశ్నించారు.

పాలిటెక్నిక్‌లో స్పాట్ కౌన్సిలింగ్
Local· 25 Aug 2026

పాలిటెక్నిక్‌లో స్పాట్ కౌన్సిలింగ్

AP :పల్నాడు జిల్లా గురజాలలో 'ఆచార్య N.G. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం' లో 'Diploma in Seed Technology' కోర్సులో ఖాళీ సీట్ల భర్తీకి ఈ నెల 27న స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. 10వ తరగతి పాసైన వారు, ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా దీనికి అర్హులేనని ప్రిన్సిపాల్ డాక్టర్ వి. సైదానాయక్ తెలిపారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కృష్ణా ఆడిటోరియంలో ఉదయం 9:30 గంటలకు ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. స్టూడెంట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్లతో నేరుగా హాజరై ఈ ఛాన్స్ వాడుకోవచ్చని తెలిపారు.