Latest

🌱 జీవ ఎరువులతో ఖర్చు తక్కువ
Local· 25 Aug 2026

🌱 జీవ ఎరువులతో ఖర్చు తక్కువ

AP : అనంతగిరి మండలం చిలకలగెడ్డ రైతు సేవా కేంద్రంలో ఆత్మ (ATMA) ఆధ్వర్యంలో రైతులకు జీవ ఎరువులపై ట్రైనింగ్ ఇచ్చారు. అరకు ఏడీఏ మోహనరావు, ఏఓ రంగారావు పాల్గొని జీవ ఎరువుల రకాలు, వాటిని ఎలా వాడాలి, వచ్చే లాభాలను వివరించారు. ఈ ఎరువులు వాడితే నేల సారం పెరిగి పంట ఖర్చు తగ్గుతుందని చెప్పారు. కెమికల్ ఎరువులు తగ్గించి, ఇష్టంగా ఆర్గానిక్ పద్ధతులు పాటించాలని రైతులకు ఆఫీసర్లు సలహా ఇచ్చారు.

హాస్పిటల్‌లో తాగే నీళ్ల దగ్గరే తిరుగుతున్న కుక్కలు🐕
Local· 25 Aug 2026

హాస్పిటల్‌లో తాగే నీళ్ల దగ్గరే తిరుగుతున్న కుక్కలు🐕

TG : జగిత్యాల జిల్లా మెట్‌పల్లి గవర్నమెంట్ హాస్పిటల్‌లో పారిశుద్ధ్యం, సెక్యూరిటీ బాలేదని రోగులు ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్‌లో వీధి కుక్కలు తిరుగుతూ భయపెడుతున్నాయి. చివరకు పేషెంట్లు తాగే వాటర్ ట్యాంక్ దగ్గరే కుక్కలు తిరుగుతున్న ఫొటోలు బయటపడ్డాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉందని జనాలు భయపడుతున్నారు. అధికారులు రోజూ చూస్తున్నా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

📄 ఒరిజినల్ సర్టిఫికెట్లు మిస్సింగ్.. దొరికితే హెల్ప్ చేయండి
Local· 25 Aug 2026

📄 ఒరిజినల్ సర్టిఫికెట్లు మిస్సింగ్.. దొరికితే హెల్ప్ చేయండి

TG : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలానికి చెందిన అగ్గండుల అనిత తన 10వ తరగతి ఒరిజినల్ సర్టిఫికెట్లు పోగొట్టుకున్నారు. నర్సంపేట బస్టాండ్ దగ్గర ఒరిజినల్ TC, Original Memo, Short Memo ఉన్న కవర్ పోయింది. దీనిపై ఇప్పటికే నర్సంపేట పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ చేశారు. ఎవరికైనా ఈ సర్టిఫికెట్స్ దొరికితే వెంటనే నర్సంపేట పోలీస్ స్టేషన్‌లో లేదా సంబంధిత పర్సన్‌కి ఇచ్చి హెల్ప్ చేయాలని కోరుతున్నారు.

📚 నవోదయ విద్యాసంస్థల డెవలప్‌మెంట్‌కు స్పెషల్ ప్లాన్
Local· 25 Aug 2026

📚 నవోదయ విద్యాసంస్థల డెవలప్‌మెంట్‌కు స్పెషల్ ప్లాన్

TG : నాగర్‌కర్నూల్ జవహర్ నవోదయ విద్యాలయంలో స్టూడెంట్స్‌కి బెటర్ ఎడ్యుకేషన్, ఫెసిలిటీస్ అందించేందుకు స్పెషల్ ప్లాన్ రెడీ చేయాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన అడ్వైజరీ కమిటీ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. పాఠశాలకు రోడ్ రిపేర్లు, విద్యార్థుల కోసం 20 కొత్త కంప్యూటర్లు కావాలని ప్రిన్సిపాల్ కోరగా, అన్ని వసతులకు ప్రపోజల్స్ రెడీ చేస్తే జిల్లా యంత్రాంగం నుంచి ఫుల్ సపోర్ట్ ఇస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

🏫 జూనియర్ కాలేజీలో క్లాస్ రూమ్స్ లేవు
Local· 25 Aug 2026

🏫 జూనియర్ కాలేజీలో క్లాస్ రూమ్స్ లేవు

TG : కామారెడ్డి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 1000 మందికి పైగా స్టూడెంట్స్ చదువుతున్నారు. కానీ సరిపడా రూమ్స్ లేక స్టూడెంట్స్ చెట్ల కింద కూర్చుని చదువుకోవాల్సి వస్తోంది. ఒకే రూమ్‌లో రెండు మూడు కోర్సులు కూర్చుంటూ ఇబ్బందులు పడుతున్నారు. బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేవని మండిపడుతూ SFI, AISA ఆధ్వర్యంలో విద్యార్థులు కాలేజ్ ఎదుట ప్రొటెస్ట్ చేశారు. గవర్నమెంట్, లోకల్ ఎమ్మెల్యే వెంటనే స్పందించి ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని డిమాండ్ చేశారు.

‘మహిళలకు ఫ్రీ బస్’ అంటూ సీఎం గొప్పలు..రియాలిటీ ఇదేనా?
TG· 25 Aug 2026

‘మహిళలకు ఫ్రీ బస్’ అంటూ సీఎం గొప్పలు..రియాలిటీ ఇదేనా?

TG: మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ అని చెప్తూ ఓ వ్యక్తి మాట్లాడిన ఓ వీడియో వైరల్ అవుతోంది. బస్సులో 80 మంది ఉంటే అందులో ఇద్దరే మగవాళ్లు ఉన్నారన్నారు. డిపార్ట్‌మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోందని, ఇలా అయితే డబ్బులెలా తేవాలని ప్రశ్నించారు. మహిళల డెవలప్‌మెంట్ కోసం ప్రభుత్వం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. వాళ్ల టికెట్ల డబ్బులు మేమే చెల్లిస్తున్నామని ఈ మధ్య సీఎం రేవంత్ కూడా గొప్పగా చెప్పారు. కానీ డబ్బులు తెమ్మని ఆర్టీసీ వేధిస్తోందని కొందరు ఇలా అంటున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి?

🪧 స్కూల్లో టీచర్లు లేరు..
Local· 25 Aug 2026

🪧 స్కూల్లో టీచర్లు లేరు..

TG : వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం బిచ్చాల్ గ్రామంలోని ZPHS హైస్కూల్‌లో నలుగురు, MPPS స్కూల్లో ఇద్దరు టీచర్లు మాత్రమే పనిచేస్తున్నారు. టీచర్ల కొరత వల్ల చదువు దెబ్బతింటోందని 150 మందికి పైగా స్టూడెంట్స్ స్కూల్ గేట్ బయట ప్రొటెస్ట్ చేశారు. MEO ఆఫీస్‌కు వెళ్లి వినతిపత్రం ఇచ్చారు. తమ ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకుని వెంటనే కొత్త టీచర్లను నియమించి, ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

🚰 15 ఏళ్లుగా మంచినీళ్లు లేవు
Local· 25 Aug 2026

🚰 15 ఏళ్లుగా మంచినీళ్లు లేవు

AP : ఏలూరు జిల్లా కట్టుమోతులగూడెంలో తాగునీరు లేక 15 ఏళ్లుగా జనాలు ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ కొళాయిల నుంచి బురద, కలుషిత నీరు రావడంతో పిల్లలు, పెద్దలు రోగాల బారిన పడుతున్నారని గ్రామస్తులు, మహిళలు నిరాహార దీక్ష చేశారు. 300 నుండి 400 ఫ్యామిలీస్ ఉండే ఈ ఊళ్లో కనీసం డ్రైనేజీ కూడా లేదని మండిపడ్డారు. అధికారులు వెంటనే కొత్త బోర్ వేసి మంచినీళ్లు అందించాలని డిమాండ్ చేశారు.

📱 అంగన్‌వాడీలకు డిజిటల్ పాఠాలు
Local· 25 Aug 2026

📱 అంగన్‌వాడీలకు డిజిటల్ పాఠాలు

AP : కాకినాడ జిల్లా శంఖవరంలో అంగన్‌వాడీ సిబ్బందికి 6 రోజులుగా జరుగుతున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఆఖరి రోజున వాట్సాప్, SMS లాంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ఎలా వాడాలో, డిజిటల్ కంటెంట్‌తో పిల్లలకి పాఠాలు ఎలా చెప్పాలో వివరించారు. అలాగే పిల్లల డెవలప్‌మెంట్‌ను చెక్ చేయడం, వారిలోని లోపాలను గుర్తించి పేరెంట్స్‌కి సరిగ్గా ఎలా ఎక్స్‌ప్లేన్ చేయాలో ట్రైనింగ్ ఇచ్చారు. నేర్చుకున్న విషయాలను క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు చేయాలని నిర్ణయించారు.

అక్రమ నిర్మాణాలు ఆపాలి
Local· 25 Aug 2026

అక్రమ నిర్మాణాలు ఆపాలి

AP : కాకినాడ జిల్లా పారుపాక గ్రామంలోని గవర్నమెంట్ ఆఫీసుల దగ్గరున్న ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా కడుతున్న నిర్మాణాలను వెంటనే ఆపేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం కాకినాడ కలెక్టర్‌కు, మంగళవారం స్థానిక MPDOకి దీనిపై వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వ స్థలాల్లో కుల, మతపరమైన కట్టడాలు కడితే భవిష్యత్తులో గొడవలు జరిగే ఛాన్స్ ఉందని చెప్పారు. అధికారులు వెంటనే రెస్పాండ్ అయి, ఆ ల్యాండ్‌ను కాపాడి అక్రమ కట్టడాలను నిలిపివేయాలని కోరారు.

మందమర్రిలో డేంజర్ గా  మారిన రోడ్డు
Local· 25 Aug 2026

మందమర్రిలో డేంజర్ గా మారిన రోడ్డు

TG : మంచిర్యాల జిల్లా మందమర్రి 1st జోన్ గ్యాస్ గోదాం ఆపోజిట్ లైన్‌లో రోడ్డు ఘోరంగా తయారైంది. రోడ్డంతా పెద్ద పెద్ద గుంతలు, పగుళ్లు, పగిలిన డ్రైనేజీ కాలువలతో చాలా డేంజర్‌గా మారింది. దీనివల్ల స్కూల్ పిల్లలు, సింగరేణి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా నైట్ టైమ్‌లో రోడ్డు సరిగ్గా కనిపించక చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ప్రజల సేఫ్టీ కోసం అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్డుకి రిపేర్లు చేయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మీకు కనిపించాల్సిన హెచ్చరిక ఎందుకు ఆగింది?
National· 25 Aug 2026

మీకు కనిపించాల్సిన హెచ్చరిక ఎందుకు ఆగింది?

చిప్స్ ప్యాకెట్ లేదా కూల్‌డ్రింక్ బాటిల్ తీసుకున్న వెంటనే.. ఇందులో చక్కెర, ఉప్పు ఎంత ఉందో ఒక్క చూపులో తెలిసిపోతే ఎలా ఉంటుంది? ఇలాంటి వివరాలు ప్యాకెట్ ముందే స్పష్టంగా కనిపించేలా హెచ్చరికలు పెట్టాలని FSSAI ప్రతిపాదించింది. కానీ దీనికి పెద్ద ఆహార కంపెనీల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ లేబుల్స్ వినియోగదారులను గందరగోళానికి గురిచేస్తాయని కంపెనీలు వాదించాయి. దీంతో FSSAI ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకుని, నలుపు-తెలుపు పోషక వివరాల పట్టికను సూచించింది. అయితే ఈ మార్పుపై సుప్రీంకోర్టులోనూ చర్చ జరుగుతోంది.

🏫 కాలేజీ ల్యాండ్స్‌లోనే ‘యాంగ్ ఇండియా’ స్కూల్ పెట్టాలి!
Local· 25 Aug 2026

🏫 కాలేజీ ల్యాండ్స్‌లోనే ‘యాంగ్ ఇండియా’ స్కూల్ పెట్టాలి!

TG : కామారెడ్డి కి సాంక్షన్ అయిన ‘యాంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్’, ‘ATC సెంటర్స్’ ని జిల్లా సెంటర్‌లోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ స్థలంలోనే పెట్టాలని TNSF నేత డాక్టర్ బాలు, TJS జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. బస్సు సదుపాయం, సరైన సౌకర్యాలు లేని చోట పెడితే స్టూడెంట్స్‌కి ఇబ్బంది అవుతుందని చెప్పారు. టౌన్ సెంటర్‌లో పెడితేనే అందరికీ యూజ్‌ఫుల్‌గా ఉంటుందని, ప్రభుత్వం వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

📝 చిలమత్తూరులో రైతుల ధర్నా
Local· 25 Aug 2026

📝 చిలమత్తూరులో రైతుల ధర్నా

AP : శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు సబ్‌ రిజిస్ట్రార్ ఆఫీస్ ముందు చాగలేరు పంచాయతీ రైతులు నిరసనకు దిగారు. స్లాట్ బుక్ చేసుకుని, పేపర్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నా రెండు వారాలుగా భూముల రిజిస్ట్రేషన్ చేయకుండా తిప్పుకుంటున్నారని మండిపడ్డారు. రైతుల ఆందోళనతో ఆఫీస్ పనులకు డిస్టబెన్స్ కలగగా, సబ్‌ రిజిస్ట్రార్ అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు రైతులు చెప్పారు. పొలిటికల్ ప్రెజర్ వల్లే పనులు ఆపేశారని, క్లియర్ రీజన్ చెప్పి వెంటనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు.

🎓 కెమిస్ట్రీలో డాక్టరేట్ కొట్టిన తెలంగాణ అమ్మాయి
Local· 25 Aug 2026

🎓 కెమిస్ట్రీలో డాక్టరేట్ కొట్టిన తెలంగాణ అమ్మాయి

TG : హనుమకొండ జిల్లా మల్లారానికి చెందిన డ్యాగల శాలిని హైదరాబాద్ BITS పిలానీ నుంచి రసాయన శాస్త్రంలో PhD సాధించింది. క్యాన్సర్, ఇతర వ్యాధుల నానో మెడిసిన్స్‌పై రీసెర్చ్ చేసిన ఈమె, 11 ఆర్టికల్స్, ఒక బుక్ పబ్లిష్ చేయడంతో పాటు 5 పేటెంట్లు ఫైల్ చేసింది. గోల్డ్ మెడల్, బెస్ట్ ప్రజెంటేషన్ అవార్డులు గెలుచుకున్న శాలిని ప్రతిభకు మెచ్చి చైనా సంస్థలు పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్, ప్రొఫెసర్ జాబ్ ఆఫర్లు ఇచ్చాయి. దీంతో ఆమె పేరెంట్స్ ఫుల్ హ్యాపీ.

టెట్ రూల్స్ మార్చాలి
Local· 25 Aug 2026

టెట్ రూల్స్ మార్చాలి

AP : ఇప్పుడు వచ్చిన స్పెషల్ టెట్ నోటిఫికేషన్‌తో ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న టీచర్లకు ఎలాంటి యూజ్ లేదని వారు అసంతృప్తి చెందుతున్నారు. తమ ఎక్స్‌పీరియన్స్, సబ్జెక్టుల ఆధారంగా కొత్త రూల్స్ తీసుకురావాలని కోరుతున్నారు. అందరికీ ఒకే రకమైన పాస్ మార్కులు కాకుండా న్యాయమైన రూల్స్ పెట్టాలని, ఎగ్జామ్ ఆఫ్ లైన్‌లోనే పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 40% వచ్చిన వాళ్లు క్వాలిఫై అయి, 89% వచ్చినా అనర్హులు కావడం కరెక్ట్ కాదని, వెంటనే టెట్ రూల్స్ మార్చాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు.

బిహార్‌లో స్టూడెంట్స్ ఎందుకు రోడ్డెక్కారు?
National· 25 Aug 2026

బిహార్‌లో స్టూడెంట్స్ ఎందుకు రోడ్డెక్కారు?

ప్రభుత్వ ఉద్యోగం కోసం చదివిన స్టూడెంట్స్.. ఇప్పుడు అదే పరీక్షను రద్దు చేయాలంటూ రోడ్డెక్కారు! 👀 బిహార్‌లో 70వ BPSC పరీక్షలో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణలు ఉన్నాయని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో ఒకే దశలో పరీక్ష పెట్టాలని, నెగెటివ్ మార్కింగ్ తీసేయాలని కూడా కోరుతున్నారు. ఇవే డిమాండ్లతో పాట్నాలో సీఎం నివాసం వైపు మార్చ్ చేయగా.. పోలీసులు వాటర్ కేనన్లు, లాఠీలతో అడ్డుకున్నారు.

'Monsoon Day' celebrations🌧️☔
Local· 25 Aug 2026

'Monsoon Day' celebrations🌧️☔

TG : వరంగల్ జిల్లా నర్సంపేటలోని బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్లో 'Monsoon Day' వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. విద్యార్థులు రైన్ కోట్లు వేసుకొని, గొడుగులు పట్టుకుని చినుకుల్లో పాటలు పాడుతూ, ఆడుతూ ఎంజాయ్ చేశారు. కాగితపు పడవలు చేసి నీటిలో వదులుతూ ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ కార్యక్రమంలో బాలాజీ విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ ఏ. రాజేంద్రప్రసాద్ రెడ్డి, ట్రెజరర్ వనజా రెడ్డి, ప్రిన్సిపాల్ జ్యోతి, టీచర్లు పాల్గొన్నారు.

Stock Market మళ్లీ గ్రీన్‌లోకి..
Personal Finance· 25 Aug 2026

Stock Market మళ్లీ గ్రీన్‌లోకి..

ఉదయం మార్కెట్ కాస్త డల్‌గా కనిపించినా.. చివర్లో ఒక్కసారిగా పికప్ అయింది! 👀 Sensex 287 పాయింట్లు పెరిగి 77,656 దగ్గర క్లోజ్ అవ్వగా, Nifty 116 పాయింట్లు ఎగబాకి 24,335కు చేరింది. ప్రధాన కారణం క్రూడ్ ఆయిల్ ధరలు 3% పడిపోయి బ్యారెల్‌కు $90 కంటే దిగువకు రావడం. ఇరాన్‌పై అమెరికా ఆంక్షల ప్రభావం చమురు సరఫరాపై పెద్దగా ఉండకపోవచ్చన్న అంచనాలు కూడా మార్కెట్‌కు కాస్త ఊరటనిచ్చాయి. రూపాయి బలపడటం, చివర్లో కొనుగోళ్లు పెరగడం కూడా కలిసొచ్చాయి.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు నాగర్‌కర్నూల్ Students
Local· 25 Aug 2026

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు నాగర్‌కర్నూల్ Students

TG : హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ నెల 26, 27 తేదీల్లో 12వ తెలంగాణ స్టేట్ యూత్ జోన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ జరగనుంది. నాగర్‌కర్నూల్ లక్ష్య అథ్లెటిక్స్ కోచింగ్ సెంటర్ నుంచి నలుగురు ఎంపికయ్యారు. అండర్–14 ట్రయాథ్లాన్‌లో నవదీప్, అండర్–16 (600 మీటర్లు)లో గణేష్, అండర్–20 (400 మీటర్లు)లో అజయ్, అండర్–20 (3 కిమీ పరుగు)లో నవీన్ ఎంపికైనట్లు కోచ్ రానా మల్లేష్ తెలిపారు. కష్టపడి ఆడి స్టేట్ లెవెల్లో మెడల్స్ గెలిచి నేషనల్ లెవెల్‌కి వెళ్లాలని కోచ్ Students కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

నీటిలో చిక్కుకున్న స్కూల్ బస్సు
National· 25 Aug 2026

నీటిలో చిక్కుకున్న స్కూల్ బస్సు

భారీ వర్షంతో రోడ్లపై నీరు చేరడంతో గురుగ్రామ్‌లో స్కూల్ బస్సులు మధ్యలోనే ఆగిపోయాయి. ఒక బస్సులో పిల్లలు దాదాపు నాలుగు గంటల పాటు చిక్కుకుపోయారు. 👀 తల్లిదండ్రులు స్కూల్, అధికారులకు వరుసగా ఫోన్లు చేస్తుండగా.. నీరు ఎక్కువగా ఉండటంతో సాధారణ వాహనాలు అక్కడికి చేరలేకపోయాయి. చివరికి అధికారులు క్రేన్‌ను తీసుకొచ్చి బస్సును ముందుకు జరిపారు. ఆ తర్వాత పిల్లలను మరో బస్సులోకి మార్చి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనతో తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.